పంచాయతీ కార్యదర్శి అయిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీడీవోని ఆ ఉద్యోగిని బంధువులు మహిళలు కలిసి కార్యాలయంలోనే చితక్కొట్టారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగవరం పంచాయతీ కార్యదర్శి తో ఎంపీడీవో రఫీ ఖాన్ అసభ్యంగా ప్రవర్తించాడు. గత కొన్ని రోజులుగా ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శి అయిన ఆ మహిళను లైంగికంగా వేధించసాగాడు. ఓపిక నశించిన ఆమె గురువారం బంధువులు మహిళలతో కలిసి వచ్చి ఎంపీడీవో రఫీ ఖాన్ ను కార్యాలయంలోనే చితక్కొట్టారు. అధికారికి దేహశుద్ధి చేసిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.