చికెన్ పకోడా దుకాణాలపై హెల్త్ ఆఫీసర్ ఆకస్మిక దాడులు
నెల్లూరు లోని పాత జడ్పీ ఆఫీస్ ప్రాంతం, సుబేదారు పేట రోడ్డు లోని చికెన్ పకోడా షాపులపై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఆదేశానుసారం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అమరేంద్ర నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో, గెజిటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వెంకటేశ్వరరావు, నీరజ, ప్రశాంతి ఫ్లోరాలను సమన్వయం చేసుకొని, సంయుక్తంగా కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించకుండా ప్రజారోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న దుకాణదారుల వద్ద నుండి దాదాపు 30 కేజీల వరకు చికెన్ పకోడాను స్వాధీనం చేసుకొని, పదివేల రూపాయల జరిమానా విధించారు.
ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అమరేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ… కృషిప్రజారోగ్యం పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించని పలు దుకాణాలపై దాడులు చేసి, సంబంధిత చికెన్ పకోడాను స్వాధీనం చేసుకోవడమే కాకుండా దానిని ధ్వంసం చేసినట్లు తెలిపారు. , మొదటి హెచ్చరిక కింద జరిమాన విధించినట్లు తెలిపారు. మరొకసారి ఇటువంటి చర్యలు పునరావృతం అయితే షాపులను సీజ్ చేయడమే కాకుండా యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా కచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రేడ్ లైసెన్స్లను కలిగి ఉండాలని 100% పరిశుభ్రతను పాటించాలని కోరారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ కృష్ణారెడ్డి, సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు