నేను జీవితంలో ఎందుకు పనికిరాని మా తాత అల్లు రామలింగయ్య భావించే వారిని ప్రముఖ హీరో అల్లు అర్జున్ పేర్కొన్నారు.
ఆయన ఉండి ఉండే నా ఎదుగుదలని చూసుండేవారు’ అని అన్నారు హీరో అల్లుఅర్జున్. తన కోసం ఆయన రూ.10లక్షలు జమ చేసి ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. కాగా, అల్లు రామలింగయ్య శత జయంతిని పురస్కరించుకొని ‘అల్లు రామలింగయ్య’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు.
కార్యక్రమంలోనే బన్నీ మాట్లాడుతూ.. “నాకు 16 ఏళ్లు వచ్చేవరకూ తాతయ్య, నానమ్మలతోనే ఉన్నాను. తాతయ్య చనిపోయాక రూ.10 లక్షల ఇన్స్యూరెన్స్ డబ్బు వచ్చింది. అయితే ఆ డబ్బు నాకు మాత్రమే వచ్చింది. ఆయన ఎందుకిలా చేశారు..? అని బీమా కట్టిన సంవత్సరాన్ని చూశా. తాతయ్య డబ్బు జమ చేయడం మొదలు పెట్టిన సమయంలో నేను నాలుగో తరగతి చదువుతున్నా. వీడు జీవితంలో ఎందుకూ పనికిరాడు. 18 ఏళ్ల వయసు వచ్చాక ఈ పది లక్షలు వాడికి ఏదో ఒక రూపంలో ఉపయోగపడతాయని ఆయన భావించి ఈ డబ్బు నా కోసమే జమ చేశారు. ఆయన దృష్టిలో ఎందుకూ పనికి రాని నేను.. ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను. అందుకు ఆనందిస్తున్నా. ఆయన కూడా నా ఎదుగుదలను చూసి ఉంటే బాగుండేది” అని తెలిపారు.