ఏసీబీ వలలో గ్రామ సచివాలయ కార్యదర్శి
ఒంగోలు: గ్రామ సచివాలయాలకు అవినీతి చీడ అంటుకుంది. ప్రకాశం జిల్లాలో గ్రామ సచివాలయ కార్యదర్శి ఏసీబీ వలలో చిక్కారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం లక్కవరం పంచాయతీ ఉపసర్పంచ్ దత్తయ్య ను పంచాయతీ వర్కుల బిల్లులు ఫైల్ ప్రాసెస్ చేసేందుకు గ్రామ సచివాలయ కార్యదర్శి ఎం. సుజాత దేవి 30000 రూపాయలు డిమాండ్ చేశారు. ఉప సర్పంచ్ దత్తయ్య ఈ లంచావతారం గురించి ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 14400కు ఫిర్యాదు చేశారు. సోమవారం దత్తయ్య నుంచి 30000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వ్యవహారం ప్రకాశం జిల్లాలో సృష్టించింది