Tuesday, May 30, 2023
Google search engine
Homeఅంతర్జాతీయంబ్రిటన్ ప్రధానిగా రుషి

బ్రిటన్ ప్రధానిగా రుషి

బ్రిటన్​ ప్రధాన మంత్రిగా భారత సంతతి వ్యక్తి రిషి ససునాక్ ఎన్నికయ్యారు. ఈ మేరకు బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్ అధికారిక సంప్రదాయాల ప్రకారం రాజు చార్లెస్​-3 ఆహ్వానం మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రాజుతో సమావేశమైన రిషి సునాక్​.. అనంతరం ప్రధానిగా తొలిప్రసంగం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా, ఉక్రెయిన్​-రష్యా యుద్ధం మూలాన దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని చెప్పారు. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బ్రిటన్​ను బయటపడేసేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. తమ ప్రభుత్వంలో ప్రతి స్థాయిలోనూ జవాబుదారీతనం, సమగ్రత ఉంటుందని స్పష్టం చేశారు. ప్రధానిగా రాజీనామా చేసిన లిజ్​ ట్రస్​ను అభినందించారు రిషి. ఆమె దేశ అభివృద్ధి కోసం కృషి చేశారని కొనియాడారు. ఈ క్రమంలోనే చిన్న తప్పులు చేసినా, అవి ఉద్దేశపూర్వకంగా చేయలేదని భావిస్తున్నాని చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments