Tuesday, May 30, 2023
Google search engine
Homeఆంధ్రప్రదేశ్సూపర్ స్టార్ కృష్ణకు నెల్లూరు జిల్లాతో అనుబంధం ; వజ్రాయుధం సినిమా 70% సోమశిల లో...

సూపర్ స్టార్ కృష్ణకు నెల్లూరు జిల్లాతో అనుబంధం ; వజ్రాయుధం సినిమా 70% సోమశిల లో చిత్రీకరణ

*వజ్రాయుధం 70% సోమశిల లో చిత్రీకరణ*

*కృష్ణ మృతి తో ఆవేదన వ్యక్తపరిచిన జిల్లా వాసులు*
సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రాలలో ఘనవిజయం సాధించిన వజ్రాయుధం సినిమా ఆత్మకూరు నియోజకవర్గం సోమశిల లో 70 శాతం చిత్రీకరణ జరిగింది.. ఈ చిత్రంలో నటించిన నటీనటులతో సహా దర్శక నిర్మాతలు అందరూ హేమాహేమీలు కావడం విశేషం..1985 జూలై రెండవ తేదీన రిలీజ్ అయిన ఈ చిత్రం సినీ ఇండస్ట్రీలో బాక్స్ ఆఫ్ హీట్ గా నిలిచింది. 1984లో దాదాపు రెండు నెలల పాటు నిర్మాణంలో ఉన్న సోమశిల జలాశయం సమీపంలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం కథానాయకుడు కృష్ణ 29 రోజులు సోమశిల లో ఉండి నటించగా చిత్ర కథానాయక శ్రీదేవి 12 రోజులపాటు ఇక్కడ ఉండి ఈ చిత్రంలో నటించారు.. కృష్ణ, శ్రీదేవి లాంటి అగ్రతారలు నటించిన ఈ చిత్రం దాదాపు రెండు నెలల కాలంలో ఈ సినిమా షూటింగ్ చూసేందుకు జిల్లా నలుమూలల నుండి కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా జనం రావడం జరిగింది.. అప్పట్లో ప్రైవేటు బస్సులు మాత్రమే ఉండడం రహదారి సరిగా లేకపోయినా ఓ యాత్ర లాగా బస్సులను ఇక్కడికి టూరిస్ట్ బస్సులుగా కూడా చిత్రం షూటింగ్ చూసేందుకు రావడం జరిగింది. ఈ చిత్రంలో చిత్ర పరిశ్రమలోని సూపర్ స్టార్ డైరెక్టర్ అయిన రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ హీరోగా, ఇండియన్ బ్యూటీ శ్రీదేవి హీరోయిన్ నటించగా ఈ చిత్రంలో రావుగోపాల్ రావు, కైకాల సత్యనారాయణ, సీనియర్ నటులు కాంతారావు, అల్లు రామలింగయ్య, నూతన ప్రసాద్ లాంటి హేమ హేమ నటులు నటించగా సోమశిల జలాశయం నిర్మాణ దశలో ఈ చిత్రం చిత్రీకరణ జరిగింది… చిత్రం విడుదలైన తర్వాత ఘన విజయం సాధించడంతో ఈ ప్రాంత వాసులు ఎంతో ఆనందం వ్యక్తపరిచారు.. నేడు హీరో కృష్ణ మృతితో ఆనాటి సినిమా చిత్రీకరణ విశేషాలు గుర్తు చేసుకుంటూ జిల్లా వాసులు కృష్ణ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments