ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా రెడ్ క్రాస్ ఆద్వర్యంలో భారీ రక్తదాన శిబిరాలు
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ నెల 21వ తేదిన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలోనూ, రాష్ట్రం వెలుపల అనేక ప్రాంతాలలో భారీ రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నట్లు రెడ్ క్రాస్ రాష్ట్ర ఛైర్మెన్ డాక్టర్ ఆరుమళ్ల శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆదివారం కావలి రెడ్ క్రాస్ రక్తకేంద్రంలో రక్తదాన శిబిరాల ఏర్పాట్లపై వాలంటీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ఆదే రోజు నూతన రక్తదాతల నమోదు కార్యక్రమం కూడా చేపట్టాలని అన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రతీ నూతన జిల్లాలో ఆధునిక వసతులతో రెడ్ క్రాస్ రక్తకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని , రక్తం కొరత కారణంగా ఎవరూ చనిపోకూడదన్నదే తమ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా వివరించారు.
రక్తసేకరణలోనూ, యువతను రెడ్ క్రాస్ ఉద్యమంలో భాగస్వామ్యం కల్పించంలోనూ, ఇతర సేవా కార్యక్రమాలలోనూ కావలి రెడ్ క్రాస్ శాఖ రాష్ట్రంలోని అన్నీ ఉపశాఖల కంటే ప్రధమ స్థానంలో ఉందని , అందుకు కారకులైన పాలకమండలిని అభినందిస్తున్నానని డాక్టర్ శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. కావలిలో త్వరలో తలస్సీమియా సెంటర్ , హోమ్ నర్శింగ్ తదితర సేవా పథకాలను ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఇటీవల అత్యధిక సంఖ్యతో రక్తదాన శిబిరం నిర్వహించిన టీం సేవియర్స్ కు ట్రోఫి బహుకరించారు. అనంతరం కావలి రక్తకేంద్రానికి రెడ్ క్రాస్ జాతీయశాఖ సమకూర్చిన నూతన రక్తనిధి పరికరాలను కావలి మునిసిపల్ కమీషనర్ శివారెడ్డితో కలసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కావలి రెడ్ క్రాస్ ప్రతినిధులు డాక్టర్ బెజవాడ రవికుమార్ , డి.రవి ప్రకాష్ , డి.సుధీర్ నాయుడు, జి.ప్రసన్నాంజనేయులు, కలికి శ్రీహరిరెడ్డి, కె.హరినారపరెడ్డి, యం.పార్వతీశంకర్ , డా॥ రేవంత్ కుమార్ , డాక్టర్ రమ్య , ప్రణీత్ , హర్ష , వినీల్ , కీర్తి , సౌందర్య , రమణ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.