సీఎంను కలిసిన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్
నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మంగళవారం సీఎం జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ తల్లి మరణించడంతో ఆయనను పరామర్శించేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వచ్చారు. ఎర్రగొండపాలెం హెలిపాడ్ వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డిని నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కలిశారు.