ముందస్తు ఎన్నికలు వస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంవత్సరం ముందే ఇంటికి పోతుంది అని మరోసారి ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీకే చెందిన మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి
గత కొన్ని రోజుల నుంచి వైఎస్ఆర్సిపి పార్టీలో గెలిచి వైఎస్ఆర్ సీపీ పార్టీ పైనే సంచలన ఆరోపణలు,విమర్శలు చేస్తున్న ఆనం రామనారాయణరెడ్డి ఈరోజు మళ్లీ అదే తరహాలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు ,,సైదాపురం లో జరిగిన వైఎస్సార్ పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్న రామనారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమకు అధికారం ఇచ్చి నాలుగు సంవత్సరాలు గడిచిపోయిందని అలాగే ప్రభుత్వం సచివాలయాల నిర్మాణానికి ఇచ్చిన సంవత్సర కాలం గడువు కూడా పూర్తయిపోయిందని అయినా ఇప్పటికీ సచివాలయాలు పూర్తి కాలేదని సచివాలయం నిర్మించిన, నిర్మిస్తున్న కాంట్రాక్టర్లు బిల్లులు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని సంవత్సరం కాలం ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుందని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మా ప్రభుత్వం ఇంటికి పోతుందని సొంత పార్టీపైనే ఘాటైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది గతంలో కూడా రెండుసార్లు బహిరంగ సభలోనే ప్రభుత్వ తీరుపై మండిపడ్డాను రామనారాయణ రెడ్డి నాలుగు సంవత్సరాలు పూర్తయిన ఏమి అభివృద్ధి సాధించామని ప్రజలను ఓట్లు అడగాలి అని ఒక సారి, నేను అసలు ఎమ్మెల్యే నాన్న అంటూ మరోసారి ఎలా ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఆనం రామనారాయణరెడ్డి వైఎస్ఆర్సిపి లో మరో రఘురామకృష్ణం రాజులా వ్యవహరిస్తున్న తీరు అధికార పార్టీకి మింగుడు పడడం లేదు అని తొందర్లోనే ఆనం రామనారాయణరెడ్డి పార్టీ మారే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు…