పేద బిడ్డకు పెద్ద కష్టం!
లివరు వ్యాధితో బాధపడుతున్న తొమ్మిది నెలల చిన్నారి
ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు
దయగలవారు ఆదుకోవాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి
నిరుపేద చిన్నారికి పెద్ద కష్టమే వచ్చి పడింది. ఖరీదైన జబ్బు ఆ చిన్నారికి శాపంగా మారింది. ఆ చిన్నారి తల్లిదండ్రులు నిరుపేదలు. కూలి చేసుకుంటే కానీ రోజు గడవని పరిస్థితి. ఆ చిన్నారికి లివర్ వ్యాధి సోకింది. నిరుపేదలైన తల్లిదండ్రులు తమ చిన్నారిని బతికించుకునేందుకు దయార్ద్ర హృదయులు కోసం ఎదురుచూస్తున్నారు. ఆత్మకూరు మండలం వాసిలికి చెందిన నారా వెంకటేశ్వర్లు, నందినిలకు తొమ్మిది నెలల కుమార్తె ఉంది. వారిది నిరుపేద కుటుంబం. కూలికి పోతే కానీ రోజు గడవని పరిస్థితి. తొమ్మిది నెలల చిన్నారికి కాలేయ వ్యాధి సోకింది. చిన్నారి వైద్యం కోసం తల్లిదండ్రులు తమ శక్తికి మించి ఖర్చు చేశారు. తమ చిన్నారిని చెన్నైలోని గ్లనేగల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ ఆస్పత్రిలో చికిత్స కొరకు తీసుకువెళ్లారు. అక్కడ లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని వైద్యులు వెల్లడించారు. తమ స్తోమతకు మించిన వైద్యం కావడంతో ఆ తల్లిదండ్రులకు ఏమి చేయాలో పాలు పోలేదు. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ గాను 17 1/2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఆసుపత్రి వర్గాలు తెలిపినట్లు చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు. పదిహేడున్నర లక్షలే కాకుండా అదనంగా మందులు, ఇతర ఖర్చులకు మరో ఆరు లక్షల రూపాయలు ఖర్చవుతుంది అని ఆసుపత్రి వైద్యులు తెలిపారని చిన్నారి తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో లివర్ ఫ్రాన్స్ ప్లాంటేషన్ వైద్యం కోసం డేట్ ఇచ్చారని వారు వివరించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పది లక్షల రూపాయలు మంజూర అయిందని, మిగిలిన నిధుల కోసం ఏమి చేయాలో పాలుపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దయగల హృదయులు ఆదుకొని మా చిన్నారికి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. బుధవారం నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆ చిన్నారి తల్లిదండ్రులు తమ ఆవేదన వెల్లబోసుకున్నారు. చిన్నారికి ప్రాణభిక్షకు పెట్టాలని వారు వేడుకుంటున్నారు. దయార్ద్ర హృదయంతో ఆదుకునేవారు 9177674074 ఫోన్ పే నెంబర్ కు గాని, 57 97 10 100 66 72 అకౌంట్ నెంబరు, ఆత్మకూరు కెనెరా బ్యాంక్, ఐ ఎఫ్ ఎస్ సి కోడ్ సిఎన్ ఆర్ బి 000 5 7 9 7 కు జమ చేయాలని వారు ప్రార్థించారు