తిరుపతి :
ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వైసిపి తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి తెలిపారు
తిరుపతిలోని నారాయణ గ్రూపు విద్యాసంస్థలకు సంబంధించిన ప్రిన్సిపల్స్ మరియు ఉపాధ్యాయులతో బుధవారం ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
ఇంతమందిని ఇక్కడ కలిసేందుకు అవకాశం కల్పించిన పెద్దలు, నారాయణ కి, సహకరించిన ఏజీయంలకు, ప్రిన్సిపాల్స్ కు ధన్యవాదాలు తెలిపారు. మొదటినుంచి వ్యవసాయ ఆధార కుటుంబమని, పేద ప్రజలకు సేవచేయాలనే తలంపుతో ప్రతి ఆరు నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్స్ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా కొన్ని వేల మందికి ఆపరేషన్స్ చేయించామని తెలిపారు.
ప్రైవేట్ విద్యా సంస్థల యజమానుల, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని, అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్లలో, కాలేజీల్లోని పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఏ విధమైన బెనిఫిట్స్ పొందుతున్నారో అవన్నీ కూడా ప్రైవేటు ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు కూడా వర్తించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. మీ అందరు కూడా మీతో పాటుగా మీకు తెలిసిన వాళ్ళందరి చేత నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని కోరారు.
ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి: పేర్నాటి
RELATED ARTICLES