పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించండి
కావలిలో జరిగిన పార్టీ సర్వసభ సమావేశంలో సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులకు దిశా నిర్దేశం చేసిన నెల్లూరు జిల్లా అగ్ర నాయకులు
కావలిలోని RSR కల్యాణ మండపంలో శనివారం జరిగిన కావలి నియోజకవర్గ సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులతో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ సమావేశంలో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.
సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యూలు కాకాణి గోవర్ధన్ రెడ్డి , పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రివర్యులు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి , నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు యంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి , కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి , కావలి నియోజకవర్గ పరీశీలకులు కదిరి బాబు రావు సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులను ఉద్దేశించి మాట్లాడుతూ మన పార్టీ అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు అయ్యిందని, కార్యకర్తల రెక్కల కష్టంతో పార్టీని అధికారంలోకి తెచ్చుకొన్నామని, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదవాళ్ళ తలరాతన మార్చాడని తెలిపారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు వస్తున్న పట్టభద్రుల ఉపాధ్యాయ ఎన్నికల్లో మన పార్టీ మొట్టమొదటిసారిగా పోటీ చేస్తుందని, సచివాలయ కన్వీనర్లు గ్రామ సారధులు అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకొని త్వరలో జరిగే పట్టబధ్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకొని, ముఖ్యమంత్రి కి ఈ రెండు స్థానాలు బహుమతిగా ఇవ్వాలని పార్టీ అగ్ర నాయకులు కోరారు.