తల్లి పరీక్ష కు- కొడుకుకు ఉమెన్ కానిస్టేబుల్ పాలిచ్చి, లాలించిన వైనం
కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష సందర్భంగా చూపరులను కట్టిపడేసే సన్నివేశం.
అన్నమయ్య జిల్లా, రాజంపేట అన్నమాచార్య కాలేజీ లో ఈ రోజు కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష జరిగింది.ఈ క్రమంలో ఓ తల్లి పరీక్ష వ్రాసేందుకు 4 నెలల బుడ్డోడితో కాలేజీకి చేరింది.ఆమె తన తల్లికి, భర్తకు బిడ్డను అప్పగించి పరీక్ష వ్రాసేటందుకు పరీక్ష కేంద్రానికి చేరింది. పరీక్ష మొదలైన అరగంట నుండి ఏడుపు అందుకున్న బాబు.
లాలించారు, ఎంత చేసినా బుడ్డోడి ఏడుపు ఆగలేదు.
అక్కడే విధినిర్వహణలో ఉన్న మన్నూరు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రీమతి అమరావతి WPC 2188, పిల్లాడిని ప్రేమగా దగ్గరకు తీసుకొని పాలిచ్చి లాలించి నిద్రలోకి జారుకునేలా చేసింది.
ఇదంతా గమినిస్తున్న విధులలో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది కానిస్టేబుల్ అమరావతి సేవకు ఫిదా అయ్యారు.
.