రెడ్ క్రాస్ రక్తకేంద్రంలో జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన ఆర్డీఓ శీననాయక్
కావలి రెడ్ క్రాస్ రక్త సహాయ సేవలలో మరొకసారి రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానంలో నిలవడం అభినందనీయమని కావలి ఆర్డీఓ మరియు
రెడ్ క్రాస్ డివిజన్ అధ్యక్షులు వి కె శీనానాయక్ పేర్కొన్నారు. రిపబ్లిక్ డే సందర్బంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం అభయం స్వచ్చంద సేవా సంస్థ నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరాన్ని ఆర్డీఓ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ రక్త కేంద్రాన్ని మరింత ఆధునీకరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో రెడ్ క్రాస్ బాధ్యులు రవిప్రకాష్, సుధీర్ నాయుడు, ప్రసన్నాంజనేయులు, హరినారాపరెడ్డి, మధురంతకం నళిని, బి యస్ ప్రసాద్, అభయం సేవా సంస్థ నిర్వాహకులు ఇలింద్ర వెంకటేశ్వర్లు, శ్రీవాణి, వంశీ, మోహన్, రక్త కేంద్రం మెడికల్ ఆఫీసర్లు కృష్ణారావు, రేవంత్, రమ్య తదితరులు పాల్గొన్నారు.