మద్యం కేసులో రామచిలుక అరెస్ట్
బిహార్ గయాలోని గురువాలో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. గ్రామంలో అమృత్ మల్లా అనే వ్యక్తి అక్రమంగా మద్యం విక్రయిస్తుండటంతో పోలీసులు అతడి ఇంటిపై రైడ్ చేశారు. పోలీసులు వస్తున్న విషయాన్ని రామచిలుక గమనించి తన పలుకులతో యజమానికి చెప్పడంతో.. అతని ఫ్యామిలీ తప్పించుకుంది. దీంతో అతడికి సాయం చేసిన రామచిలుకను స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.