ఆనం చూపు బిఆర్ఎస్ వైపు?
మూడో జాతీయ ప్రత్యామ్నయం వైపు ప్రజలు చూస్తున్నారని నర్మగర్భ వ్యాఖ్యలు
సంచలన రాజకీయాలకు కేంద్రబిందువైన మాజీ మంత్రి, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ టాపింగ్ లో ఉందంటూ మంగళవారం నెల్లూరులో ఆయన కుండ బద్దలు కొట్టారు. గత ఒకటిన్నర సంవత్సరం గా తన ఫోన్ టాపింగ్ చేస్తున్నారంటూ ఆయన విమర్శలు చేశారు. పనిలో పనిగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చూసారు.. ఇప్పటి వైసీపీ ప్రభుత్వం చూస్తున్నారు.. వాటి పనితీరును ప్రజలు బేరీజు వేసుకున్నారు.. జాతీయ స్థాయిలో బిజెపి కాంగ్రెస్ మనకు కూడా చూశారు.. జాతీయస్థాయిలో మూడో ప్రత్యామ్నయం కూడా రావాలి.. బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది.. అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం విశేషం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాట్లాడుతూనే జాతీయ స్థాయిలో మూడో ప్రత్యామ్నాయ అంటూ ఆనం వ్యాఖ్యలు చేయడం విశేషం. బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ తో ఆనం కుటుంబానికి సత్సంబంధాలే ఉన్నాయి. ఆనం, కెసిఆర్ తెలుగుదేశం పార్టీలో కలిసి ప్రయాణించిన వారే. కెసిఆర్ తన బిఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆనం రామనారాయణ రెడ్డి బిఆర్ఎస్ మూడో ప్రత్యామ్నయం అంటూ వ్యాఖ్యలు చేయడం ప్రకంపన సృష్టిస్తోంది