మొక్కలు నాటి సంరక్షించాలి
మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించాలని చిట్టేటి మధుసూదన రావు పిలుపునిచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా శనివారం దగదర్తి లో
శ్రాంత ఉపాధ్యాయుడు చిట్టేటి గరటయ్య జ్ఞాపకార్థం మల్లయ్య స్వామి ఆలయంలో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్టేటి మధుసూదరావుకు యువ న్యాయవాది, జాతీయ సేవా అవార్డు గ్రహీత రమణయ్య స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం మల్లయ్య స్వామి గుడికి వచ్చిన భక్తులకు మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా చిట్టేటి మధుసూదనరావు మాట్లాడుతూ తన తండ్రి గరటయ్యకు మొక్కల పెంపకం వాటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ అంటే ప్రాణం అన్నారు. ఆయన జ్ఞాపకార్థం గ్రామంలో మొక్కలు పంపిణీ చేయడం తన అదృష్టమని పేర్కొన్నారు. న్యాయవాది ఇర్ల వెంకట రమణయ్య మాట్లాడుతూ తనకు చిన్న నాడు అక్షరాభ్యాసం చేయించింది గరటయ్య మాస్టారు అని తన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. గరటయ్య మాస్టారు తమకు విద్య తో పాటు పర్యావరణ పరిరక్షణ మొక్కల పెంపకం వంటి అంశాలపై కూడా బోధించే వారిని గుర్తు చేసుకున్నారు. గరటయ్య మాస్టారు ఆశయాలను కొనసాగిస్తామని వెంకటరమణయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో గరటయ్య మాస్టారు సతీమణి రాజేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిట్టేటి రాజేశ్వరమ్మ ఆధ్వర్యంలో భక్తులకు భారీగా అన్నదానం జరిగింది. దగదర్తి గ్రామం నుంచి భారీగా భక్తులు తరలి వచ్చారు.