దోమల నిర్మూలనకు చర్యలు
దోమల నిర్మూలనకు తగిన చర్యలు తీసుకుంటున్నామని నెల్లూరు కార్పొరేషన్, రూరల్ నియోజకవర్గం పరిధిలోని 41 వ డివిజన్ కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి పేర్కొన్నారు. రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప, శివగిరి కాలనీ ప్రాంతాల్లో సోమవారం కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో స్థానికులు పలు సమస్యలను కార్పొరేటర్ విజయలక్ష్మి దృష్టికి తీసుకు వచ్చారు. ఆమె స్పందించి నెల్లూరు కార్పొరేషన్ ప్రజారోగ్య విభాగం అధికారులతో చర్చించి తమ డివిజన్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణకు శ్రీకారం చుట్టారు. కాలువలు పూడిపోయి మురుగు మీరు ముందుకు కదలకపోవడం తో దోమలు ప్రబలి వ్యాధులను వ్యాపింప చేస్తున్నాయని కార్పొరేటర్ విజయలక్ష్మి దృష్టికి వచ్చింది. దాంతో ఆమె రంగంలోకి దిగి ఆయా ప్రాంతాల్లో కాలువల్లో పూడిక తీయించారు. అదేవిధంగా దోమలు ప్రబలకుండా దోమల నిర్మూలన ముందు పిచికారి చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డివిజన్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏ సమస్య ఉన్న నా దృష్టికి తీసుకువస్తే రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానికులు ఏడుకొండలు, రంగయ్య, ఈశ్వరమ్మ, సురేష్, యశ్వంత్, వంశి తదితరులు పాల్గొన్నారు