అట్టహాసం గా ఎల్ సి రమణారెడ్డి నామినేషన్
తూర్పు రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్ సి రమణారెడ్డి బుధవారం చిత్తూరులో నామినేషన్ దాఖలు చేశారు. 54 ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్ సి రమణారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి ఉపాధ్యాయులు భారీగా తరలి ఎవరికి వారు స్వచ్ఛందంగా వాహనాలు ఏర్పాటు చేసుకొని చిత్తూరుకు తరలి వెళ్లడం విశేషం. సుమారు వెయ్యి మందికి పైగా ఉపాధ్యాయులు మూడు జిల్లాల నుంచి ఎల్సీ రమణారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్లినట్లు తెలుస్తోంది