ఆదర్శనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్
నేటి యువతకు ఆదర్శనీయుడు మూలాన అబుల్ కలాం ఆజాద్ అని యువ న్యాయవాది, సేవ అవార్డు గ్రహీత ఇర్ల వెంకటరమణయ్య పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొత్తూరు టీచర్స్ కాలనీలో గురుస్తాన్ కోచింగ్ సెంటర్లో బుధవారం మూలాన అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కోచింగ్ సెంటర్ కరస్పాండెంట్ మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇర్ల వెంకట రమణయ్య మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు వివరించారు. భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా అబుల్ కలాం వ్యవహరించారని పేర్కొన్నారు. స్వతంత్ర సమరయోధుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ ప్రిన్సిపాల్, సిబ్బంది పాల్గొన్నారు