నెల్లూరు నగరంలో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. ఇందుకు ఈ మురుగు నీరు ఉదాహరణ. నగరం లోని ఉస్మాన్ సాహెబ్ పేట కోదండరామపురంలో మురుగు నీరు రోడ్డెక్కింది. మల్లపుకాలువ పూడిక తో నీండిపోయి మురుగు నీరు ముందుకు కదలడం లేదు. దానికి కనెక్ట్ డ్రైనేజీలో పూడిక తీయడంతో డ్రైనేజీలలో నీరంతా మల్లపుకాలువలోకి చేరి దాని లో కూడా పూడి నిండి ఉండటంతో మురుగు నీరు ముందుకు కదలక రోడ్డు మీద కు చేరింది. రద్దీగా ఉండే రోడ్డు మీద మురుగు నీరు చేరడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
రోడైక్కిన మురుగు నీరు
RELATED ARTICLES